ప్రజలంతా సుఖ, సంతోషాలతో.. సుభిక్షంగా ఉండాలి
ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి ఏప్రిల్ 17: సిద్దిపేట లో శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ సీతా రామ చంద్ర స్వామి కళ్యానోత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లోకరక్షకుడు.. సుపరిపాలనాదక్షకుడు.. అయిన శ్రీరాముడు అంటే సర్వ జగద్రక్ష అని, శ్రీ రామ నామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని, భక్తుల ప్రగాఢ నమ్మకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శ్రీరామ నవమి సందర్బంగా సిద్దిపేట పట్టణం లో ఆలయాల్లో జరిగే కళ్యానోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీరాముడు హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామ తత్వం.
కష్టంలో కలసి నడవాలన్నది సీతాతత్వం అని.. శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరంతో ముందుకు సాగి విజయం సాదించారని శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీరాముని అనుగ్రహంతో అన్నింటా శుభం జరగాలని, ప్రజలందరు సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. సిద్దిపేట పట్టణం లో 4 గంటల పాటు 25 ఆలయాల్లో జరిగిన శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యానోత్సవాల్లో పాల్గొన్నారు. ఒక వైపు శ్రీరామ నామ స్మరణ, మరో వైపు ప్రజలతో ఆత్మీయ పలకరింపుతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.