Trending Now

‘ఆ చెట్లను తొలగించండి’.. మున్సిపల్ ఆఫీస్ వద్ద అఖిలపక్షం నేతల ధర్నా

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 27: సిద్దిపేట పట్టణ పరిధిలో విద్యుత్ తీగల కింద నాటిన కొనొకార్పస్ చెట్లను తొలగించాలని సిద్ధిపేట అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం విద్యుత్ తీగల కింద, రోడ్ల వెంట నాటిన కోనోకార్పస్ చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి కి పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్బంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలో హరిత హారం కార్యక్రమంలో నాటిన కోనోకార్పస్ చెట్లతో మనుషులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వాటికి తొలగించాలని వారు కోరారు. కొనోకార్పాస్ చెట్ల వేర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులకు చుట్టుకొని మురుగు నీరు పోవడం లేదనీ అన్నారు. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వల్లే కరెంటు సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని వెంటనే చెట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News