ప్రతిపక్షం, సిద్దిపేట ప్రతినిధి. మార్చి 26: ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. అలా పెట్టిన వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగుచర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు తప్పుడు వార్తలు పెట్టే వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని సూచించారు. సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ కు 8712667100 తెలియజేయాలని.. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.