Trending Now

‘బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ

ప్రతిపక్షం, ప్రతినిధి సిద్దిపేట, జూన్ 29 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. జూలై 1 నుండి 31 వ తేదీ వరకు వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం పై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంటు అధికారులు, సిబ్బందితో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా ఇప్పటివరకు 946 మంది పిల్లలను సేవ్ చేయడం జరిగిందన్నారు. అన్ని డిపార్ట్మెంట్ కలిసి సమన్వయంతో టీం వర్క్ చేయాలని సూచించారు.

చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాట, వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్ఐ, నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. వీరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. పిల్లలను రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించే ముందు జిల్లా మెడికల్ అధికారులతో టెస్ట్ నిర్వహించాలని సూచించారు.

బాలకార్మికుల లేకుండా సమిష్టిగా కృషి చేద్దామని, వారికి కావలసిన అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఎవరైనా బాలకార్మికులను, అనాధ పిల్లలను, చూసినప్పుడు 1098 లేదా డయల్ 100, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 87126 67100 ఉమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ 9440700906, ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ముస్కాన్ -X కు సంబంధించిన వాల్ పోస్టర్ లను విడుదల చేశారు.

ఈ సమావేశంలో డిడబ్ల్యుఓ శారద, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ గురుస్వామి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, కే రాజలింగం, సిడబ్ల్యుసి చైర్మన్ సిద్దిపేట్, కే. రాము డిసిపిఓ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ మమత, సఖి అడ్మిన్ ప్రతిమ, యాదగిరి రెడ్డి ఎస్ఐ, శ్రీరాములు ఏఎస్ఐ, డిసిపిఓ, చైల్డ్ లైన్ సిబ్బంది రమేష్, రాజు, నర్సింలు, అనిత, కనకరాజు, రేష్మ, మహేష్, మౌనిక, ఉమ, రాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, షీటీమ్, ఆపరేషన్ ముస్కాన్ సిబ్బంది పోలీస్ అధికారులు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News