Trending Now

యధేచ్ఛగా సింగరేణి భూములు అన్యాక్రాంతం..

ప్రతిపక్షం, మంథని, మార్చి 27 : సెంటినరీ కాలనీలో యధేచ్ఛగా సింగరేణి భూములు కబ్జాకి గురవుతున్నాయి. సింగరేణి భూ నిర్వాసిత గ్రామమైన వకిలిపల్లి, మంగళీపల్లి గ్రామ నివాసులకు రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన ఆర్ & ఆర్ కాలనీకి అనుకోని సింగరేణి భూమునీ ఆక్రమించి ఏకంగా నిర్మాణాలను చేపట్టారు. సంబధిత అధికారులు పట్టించుకోవడంలేదనే అపవాదును మూట గట్టుకుంటున్నారు. బతుకుదెరువుకు చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంటేనే అనుమతించని సింగరేణి అధికారులు, ఇంటికి అనుకొని ఉన్న భూములు ఏవైనా తమవేనానే దురాశతో నిర్మాణాలు చెప్పట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News