Singareni to regularise 2364 transfer workers as general labourers: సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణిలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ కార్మికులను రెగ్యులర్ వర్కర్లు(జనరల్ మజ్దూర్)గా క్రమబద్ధీకరిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణి కాలరీస్ సంస్థలోని భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనుల్లో 240 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వీరిని జనరల్ మజ్దూర్‌గా గుర్తించనున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా సంస్థలో చేరిన వారిని తొలుత బదిలీ వర్కర్లుగా సంస్థ పరిగణించనున్నారు. ఉన్నత విద్యార్హతులు కలిగిన వీరంతా కంపెనీలో ఇంటర్నల్ ఉద్యోగాల ద్వారా పదోన్నతులు పొందడానికి అర్హత లభించనుంది.