ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కారు ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలు అయినట్లు వస్తోన్న వార్తలను సింగర్ మంగ్లీ ఖండించారు. తనకు ప్రమాదం జరిగిందని తెలిసి అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారని, తాను క్షేమంగానే ఉన్నట్లు ఆమె ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. ఇది అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదమని ఆమె తెలిపారు. ఈ యాక్సిడెంట్ రెండు రోజుల క్రితం జరిగిందని.. రూమర్స్ ను నమ్మకండని ఆమె క్లారిటీ ఇచ్చారు. మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు అని తెలిపారు.