శ్రీరామ నామస్మరణతో మారుమోగిన సోన్..
నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 17 : నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని శ్రీరామనవమిని పురస్కరించుకొని బుధవారం సోన్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ కోలాటాలు ఆడారు.
దేవి, దేవతల విగ్రహాలను ఇతర పంట చెట్ల ఆకులతో అత్యంత శోభయమానంగా అలంకరించారు. సీతారాముల స్వామి ఉత్సవ విగ్రహమూర్తులను పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. తదనంతరం గ్రామంలో వీధుల గుండా ఊరేగించారు. శ్రీరామనవమి విశిష్టతను ఆలయ అర్చకులు అక్షోభ్యాచారి భక్తులకు శ్రీరామనవమి విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ హనుమాన్ భక్తులు వీడిసి సభ్యులు, గ్రామ యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.