ప్రతిపక్షం, దుబ్బాక ఏప్రిల్ 17: శ్రీరామనవమి పురస్కరించుకొని బుధవారం సీతారాముల కళ్యాణం దుబ్బాక మండల పరిధిలోని పలు గ్రామాల్లో అంగ రంగవైభవంగా జరిపినారు. పోతారం గ్రామములో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సతీ సమేతంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుబ్బాక బాలాజీ ఆలయంలో జరిగిన సీతారాముల కల్యాణానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక తన స్వగృహం నుండి వేద పండితుల చేత పుస్తె, మెట్టలు తలంబ్రాలకు పూజలు నిర్వహించి బాలాజీ ఆలయానికి మంగళ వాయిద్యాలతో తీసుకెళ్లడం జరిగింది. పట్టణంలో శ్రీవీరాంజనేయ దేవస్థానము ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె బూమిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలు నిర్వహించారు. దుబ్బాక మున్నూ రు కాపు సంఘంలో అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేడుకలు సంఘం సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.