హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ(BSP)కి గట్టి షాక్ తగిలింది. బీఎస్పీ రాష్ట్రాధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీతో పోరాడుతున్న బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తుని ప్రధాని మోదీ భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగుతూ.. కష్టసుఖాలు పంచుకోవడం తాను నమ్మిన ధర్మం అని ప్రవీణ్ అన్నారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని తన ప్రస్థానాన్ని ఆపలేనని స్పష్టం చేశారు.