హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పెదవి విరిచారు. అసెంబ్లీలో దివంగత స్పీకర్ శ్రీపాద రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. గత పదేళ్ళలో శాసనసభ సరిగా నిర్వహించలేదన్నారు. ప్రజలకు శాసనసభలో ఏం అవుతుందో కూడా తెలియకపోయేదని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్షాలను మాట్లాడనివ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో డిబేట్ జరుగుతోందన్నారు. శాసనసభ డిబేట్లను కోట్లాది మంది చూస్తున్నారన్నారు. చిన్న పిల్లలు కూడా శాసనసభలో జరుగుతున్న సమావేశాలపై చర్చించుకుంటున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు.