ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి మార్చ్ 30: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా పల్లకి సేవ, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి శోభాయాత్ర ఆలయ చుట్టూ నిర్వహించి ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్ణీత ప్రణాళిక ఆధారంగా పల్లకి శోభాయాత్ర సేవ ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఆసౌకార్యాలు కలగకుండా ఆలయంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకొని తగిన విధంగా సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని చెప్పారు.