ప్రతిపక్షం, సిద్దిపేట, మే 27: సిద్దిపేట పట్టణంలోని శివాజీ నగర్ లో బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే 3వ బాలానందం ఆధ్యాత్మిక వేసవి శిబిరమును వేలేటి మృత్యుంజయ శర్మ , సంస్థ నిర్వాహకురాలు బి కే భవానితో కలిసి జ్యోతి ప్రజ్వలన, కేక్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ క్యాంపు లో సిద్దిపేట టెడ్డీ పాల్గొని పిల్లలతో ఆడుతూ, పాడుతూ తన హావ భావాలతో అందరిని అలరించారు.
అనంతరం అతిధులు మాట్లాడుతూ చిన్న పిల్లల లో ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుందనీ, ఆధ్యాత్మికతని కూడా తెలుసుకొని దైవభక్తితో విద్యార్థి జీవితంలోని పరీక్షలను, ప్రాక్టికల్ గా వచ్చే పరిస్థితులను ఆధ్యాత్మికత ద్వారా ఎలా దాటివేయాలో ఈశ్వరీయ జ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు అని తెలిపారు. ఈ క్యాంపులో డ్రాయింగ్ కాంపిటీషన్, స్పీచ్ కాంపిటీషన్, ఫాన్సీ డ్రెస్సెస్ కాంపిటేషన్ నిర్వహిస్తున్నామని ఇందులో గెలిచిన పిల్లలకి బహుమతులు అందజేస్తామని.. శిబిరంలో పాల్గొన్న పిల్లలందరికీ సర్టిఫికెట్ ను కూడా అందివ్వడం జరుగుతుందని సంస్థ నిర్వాహకురాలు బి కే భవాని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి మీకే స్వప్న బిందు ఓంకార్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.