ప్రతిపక్షం, స్పోర్ట్స్: అథ్లెట్లకు త్వరలోనే డిజిటల్ సర్టిఫికెట్లు ఇస్తామని స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ చెప్పారు. క్రీడల్లో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని.. ఈ డిజిటల్ సర్టిఫికెట్లో క్రీడాకారులు పాల్గొన్న ఈవెంట్లు, వాళ్లు సాధించిన పతకాల వివరాలు ఉంటాయి. ‘‘అథ్లెట్లకు డిజిటల్ సర్టిఫికెట్లు ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నాం. పారదర్శకత, భద్రతతో పాటు క్రీడా సంఘాల్లో నిర్వహణా సామర్థ్యాన్ని పెంచడానికి ఈ సర్టిఫికెట్లు ఉపయోగపడతాయి. జూన్ 1 నుంచి క్రీడా సంఘాలు డిజిలాకర్ ద్వారానే అథ్లెట్లకు సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నాయి. వీటికి మాత్రమే విలువ ఉంటుంది’’ అని అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలియజేశారు.