Trending Now

IPL 2024: నేడు సన్ రైజర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్, రాజస్థాన్ మధ్య మరో రసవత్తర పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 18 మ్యాచులు జరగ్గా.. చెరో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించాయి. టేబుల్ టాపర్‌గా ఉన్న RR జట్టు టాపార్డర్ భీకరమైన ఫామ్‌లో ఉంది. మరోవైపు SRH టాపార్డర్ నిలదొక్కుకుంటే హోంటీమ్‌కు అడ్డే ఉండదు. ఈ క్రమంలో టాపార్డర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చి సన్‌రైజర్స్ గెలుపు బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సొంతగడ్డపై సన్‌ రైజర్స్‌కు సవాల్..

రికార్డు స్థాయి స్కోర్లతో ఐపీఎల్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన SRH నేడు RRతో హైదరాబాద్‌ వేదికగా తలపడేందుకు సిద్ధమైంది. వరుస ఓటములతో డీలాపడ్డ సన్ రైజర్స్‌కు.. 9మ్యాచుల్లో 8 గెలిచి టేబుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న రాజస్థాన్‌ను ఢీ కొట్టడం సవాల్‌తో కూడుకున్న పనే. అయితే ప్లేఆఫ్స్‌కి మరింత చేరువ కావాలంటే SRH ఈ మ్యాచ్‌లో గెలవడం ముఖ్యం. సొంతగడ్డపై ఆడనుండటం SRHకు కలిసొచ్చే అంశం.

చెన్నైపై పంజాబ్ ఈజీ విక్టరీ..

చెన్నైతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ అలవోకగా విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన PBKS 13 బంతులు మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసింది. పంజాబ్ బ్యాటర్లలో బెయిర్ స్టో(46), రోస్సో(43) రాణించారు. సామ్ కరన్(26), శశాంక్(25) జట్టును విజయతీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో శార్దూల్, రిచర్డ్, దూబే తలో వికెట్ తీశారు.

ముంబై రికార్డు సమం చేసిన పంజాబ్..

చెన్నైపై పంజాబ్ అరుదైన ఘనత సాధించింది. ఆ జట్టును వరుసగా ఐదు సార్లు ఓడించింది. దీంతో ముంబై తర్వాత ఈ ఫీట్ సాధించిన జట్టుగా నిలిచింది. మరోవైపు చెపాక్ మైదానంలో చెన్నైపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై తర్వాతి స్థానంలో PBKS నిలిచింది. ముంబై ఐదు సార్లు చెపాక్‌లో CSKపై నెగ్గగా.. పంజాబ్ 4 సార్లు గెలిచింది.

Spread the love

Related News

Latest News