ప్రతిపక్షం, వెబ్ డెస్క్: దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. నా ఒకటవ చిత్రం గంగోత్రి ఇదే రోజున విడుదలైంది. ఇవాళ నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో మేడమ్ టు స్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నాను. 21ఏళ్ల నా కెరీర్‌లో ఇది మరపురాని ప్రయాణం. మీలో ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞుడను’ అంటూ Xలో రాసుకొచ్చాడు.