ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి, నిర్మల్, జూలై 0 4: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరాజుద్దీన్ పదవీ విరమణ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జుట్టు గజేందర్ పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ పదవీకాలంలో నిస్వార్ధంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే ఉపాధ్యాయుల పదవీ విరమణ కార్యక్రమాలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. వారికి రావలసిన అన్ని పెన్షనరీ లాభాలు అదే రోజు చెల్లించి, ప్రభుత్వ వాహనంలో గౌరవంగా ఇంటికి సాగనంపాలని పేర్కొన్నారు.
అలాగే ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి పంపిన 5571 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని. ఎస్. జి .టి . ఉపాధ్యాయుల బదిలీలలో అనధికారిక రేషనలైజేషన్ చేపట్టడం అన్యాయమని తెలిపారు. ఎస్టీయూ జిల్లా శాఖ పక్షాన ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగం అధికారి ఎస్. పద్మ, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. భూమన్న యాదవ్, జే. లక్ష్మణ్, జిల్లా ప్రధానోపాధ్యాయ, ఉపాద్యాయ సంఘాల నాయకులు బి. మహేందర్, ముత్యం,దాసరి శంకర్, రవి కాంత్, మారెడ్డి క్రిష్ణ, పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు కె. సాయన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.