ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్, 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకూల రేవంత్ రెడ్డి ఈనెల 22న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసే భారీ ర్యాలీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సీతక్క, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస రెడ్డి, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా నుండి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆమె పలు సూచనలు ఇచ్చారు.