భారీ వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేటలో సమీక్ష నిర్వహించారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలు.. వరదలతో భారీగా ఆస్తి, ప్రాణ, పంట నష్టం చోటు చేసుకున్నట్లు చెప్పారు. రూ.5 వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసి తెలంగాణ పరిస్థితులు వివరించినట్లు చెప్పారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాదు, వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, వరదల్లో ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వెల్లడించారు.