Trending Now

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. హైకోర్టు ఆదేశాలు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3 : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విట్టల్ ఎన్నిక చెల్లదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ దండే విట్టల్ ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని.. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తుది విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్సీ దండే విట్టల్ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. అలాగే ధర్మసనం ఆయనకు 50 వేల నగదు జరిమానా విధించింది. ఒకవైపు దేశమంతట లోకసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు ఉండి ఉత్కంఠత వాతావరణంలో ముందుకు దూసుకెళ్తుండగా ఎమ్మెల్సీ దండే విట్టల్ ధర్మాసనం ఈ తరాహ షాక్ ఇవ్వడం ఆయనను మరింత ఆందోళనలో పడవేసింది.

Spread the love

Related News

Latest News