ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విట్టల్ ఎన్నిక చెల్లదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. నా ఎన్నిక చెల్లదని హై కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగా జరగలేదన్న కారణంతో ఈ తీర్పు వచ్చింది. అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నాకు సంబంధం లేని వ్యవహారం.. ఏది ఏమైనా ఈ తీర్పుపై అప్పీల్‌కు నాకు నాలుగు వారాల గడువు లభించింది. నాకు సుప్రీం కోర్టులో న్యాయం జరిగి.. హై కోర్టు తీర్పుపై స్టే వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలలో దండే విట్టల్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ దండే విట్టల్ ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని.. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తుది విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్సీ దండే విట్టల్ ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. అలాగే ధర్మసనం ఆయనకు 50 వేల నగదు జరిమానా విధించింది. ఒకవైపు దేశమంతట లోకసభ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు ఉండి ఉత్కంఠత వాతావరణంలో ముందుకు దూసుకెళ్తుండగా ఎమ్మెల్సీ దండే విట్టల్ ధర్మాసనం ఈ తరాహ షాక్ ఇవ్వడం ఆయనను మరింత ఆందోళనలో పడవేసింది.