Trending Now

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య..

ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జూన్ 12: స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘బడి బాట’ స్వాగత దినోత్సవం కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బడి ఈడూ పిల్లలందరిని బడిలో చేర్పించాలన్నారు. అదికూడ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలిని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తుందన్నారు. పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతుందని తద్వారా విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వివరించారు.

విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ఊధ్యాయులు చొరవ చూపాలన్నారు. ఆదిశగా విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలన్నారు. అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమం బడి బాట కార్యక్రమం కావడం చాలా అదృష్టంగా బావిస్తున్నానట్లు వెల్లడించారు. కడియం ఫౌండేషన్ ద్వారా బ్యాక్ టు స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను రూపొందుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, సీడీపీఓ ఫ్లోరెన్స్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఏసీపీ భీమ్ శర్మ, ఏఎంఓ శ్రీనివాస్, ఎమ్మార్వో వెంకటేష్, జడ్పీటీసీ మారాపాక రవి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News