ప్రతిపక్షం, సిద్దిపేట, మే 31: కథల పుస్తకాలు జీవన వికాసానికి సోపానాలని, విద్యార్థులు బాల్యం నుండే నీతి కథలు చదవడం ద్వారా ఉత్తమ సమాజాన్నినిర్మించే భావి భారత పౌరులుగా తయారవుతారని, వేసవి సెలవులను పుస్తక పఠనం ద్వారా సద్వినియోగం చేసుకోవడం విద్యార్థుల ఉత్తమ లక్షణమని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య అన్నారు. శుక్రవారం సిద్దిపేట సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శ్రీ మేధ వేసవి శిక్షణా శిబిరంలోని విద్యార్థులకు సుగుణ సాహితి సమితి ఆధ్వర్యంలో డా.సిరి వ్రాసిన ‘సిల్వర్ పికాక్ ఫీతర్’ అనే 54 ఆంగ్ల కథల పుస్తకాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవరాజు, రామరాజు, బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.