అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘స్త్రీ 2’. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తోంది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి చాలా మంది సూపర్ స్టార్ల సినిమాల రికార్డ్‌ను ‘స్త్రీ 2’ ఇప్పటికే బీట్ చేసేసింది. ఏ సినిమా అయినా విడుదలైన రెండో వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టిందంటే అది రికార్డే.. అయితే ‘స్త్రీ 2′ మూడో వారాంతంలో కూడా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.
ఈ సినిమా బడ్జెట్ రూ. 50-60 కోట్లు. అయితే విడుదలైన మొదటి రోజునే, ఈ చిత్రం బడ్జెట్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. విడుదలైన రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారాంతపు వసూళ్ల విషయానికొస్తే, ‘జవాన్’, ‘కల్కి 2898 AD’, ‘గదర్ 2’, ‘బాహుబలి 2’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను ‘స్త్రీ 2’ టచ్ చేసింది. మూడో వారాంతంలో రూ. 47 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొత్తం రూ. 650 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు అంచనా వేశాయి.