ప్రతిపక్షం, సిద్దిపేట, మే 07: విద్యార్థులు కథల పుస్తకాలు చదువుతూ.. సంస్కృతి, సభ్యత అలవర్చుకోవాలని, పుస్తక పఠనం తో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని, స్మార్ట్ ఫోన్, వీడియో గేమ్ లకు బానిసలు కాకూడదని, సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య అన్నారు. మంగళవారం సిద్దిపేట శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో నిర్వహిస్తున్న సంస్కృతి వేసవి శిక్షణా శిబిరం లోని విద్యార్థులకు సుగుణ సాహితి సమితి ఆధ్వర్యంలో డా.సిరి వ్రాసిన సిల్వర్ పికాక్ ఫీతర్ అనే 50 ఆంగ్ల కథల పుస్తకాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మోతుకు నరేష్ కుమార్, బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.