Trending Now

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రి గుడ్ బై..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రముఖ భారత్ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి ఆటకు గుడ్‌బై చెప్పనున్నారు. వచ్చే నెలలో కోల్‌కతా వేదికగా కువైట్‌తో జరిగే మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2005లో 21ఏళ్ల వయసులో పాకిస్థాన్ జట్టుపైనే తన తొలి అంతర్జాతీయ గోల్ సాధించిన ఛెత్రి.. ఇప్పటివరకు 94 గోల్స్ (150 మ్యాచ్‌ల్లో) చేసి.. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

ఛెత్రి అరుదైన రికార్డు.. ఆ స్టార్స్​ను దాటి..

సునీల్​.. ఆసియాలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ సాధించిన ఆటగాళ్లలో మూడో స్థానానికి చేరడం విశేషం. ప్రస్తుతం 90 గోల్స్‌తో ఉన్న ఛెత్రి.. ఇంకో రెండేళ్లు ఆటలో ఉండి, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. మెస్సీ(103), అలీ డాయ్‌ (109)ను అధిగమించి ఆసియా నంబర్‌వన్‌ స్టార్​ ప్లేయర్​గా చరిత్ర సృష్టించడం ఖాయం. ఇక ప్రపంచ స్థాయిలో తనకంటే క్రిస్టియానా రొనాల్డో (123), అలీ డాయ్‌ (109), లియోనెల్‌ మెస్సి (103) మాత్రమే ముందున్నారు. రొనాల్డో, మెస్సి లాంటి ఆల్‌టైం గ్రేట్స్‌ సరసన ఛెత్రి ఉండటం భారతీయులకు గర్వకారణం.

Spread the love

Related News

Latest News