ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ‘కల్కి’ సినిమాను చూసినట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ X వేదికగా తెలిపారు. మూవీ ఎంతో అద్భుతంగా ఉందని, ఇండియన్ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లారని ప్రశంసించారు. చిత్రం భారీ విజయం పొందిన నేపథ్యంలో నిర్మాత అశ్వనీదత్, బిగ్ బీ అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణెతో పాటు చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. సెకండ్ పార్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.