ప్రతిపక్షం, సిద్దిపేట, మే 06: లోక్ సభ ఎన్నికల పక్రియలో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయం లోని కాన్ఫరెన్స్ హల్ లో ఈవీఎం మీషన్ల సప్లిమెంటరీ రాండమైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో జిల్లా అదనపు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మనుచౌదరి నిర్వహించారు. ఈ సప్లిమెంటరి రాండమైజేషన్ లో జిల్లాలో గల 4 నియోజకవర్గాలకు 11 బ్యాలెట్ యునిట్లు, 10 కంట్రోల్ యూనిట్లు, 20 వీవీ ప్యాడ్ యూనిట్లను ఈ ఆయా నియోజకవర్గ ఏఆర్ఓలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ ఈవీఎం మిషన్లను పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు వరకు సంబంధిత ఏఆర్ఓల పరిధిలోని శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో గల స్ట్రాంగ్ రూములలో భద్రపరిచి పోలింగ్ లో ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సిఎచ్. విజయ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి ఈ. మల్లేశం, ఎలక్షన్ సూపరింటెండెంట్ మదుసూధన్, ఎలక్షన్ డీటీ శ్రీనివాస్, ఆపరేటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.