ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ పెంచుతోంది. భారత్ చివరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక 5 ఫైనల్స్‌లో ఓడింది. 2014 టీ20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2021 టెస్టు చాంపియన్‌షిప్, 2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. దీంతో ఈ సారి కప్ సాధించాలని కోట్లాది అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
T20లలో భారత్ Vs సౌతాఫ్రికా గణాంకాలివే..
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం రాత్రి టీ20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. మొత్తం 26 మ్యాచ్‌లలో భారత్ 14 గెలిచింది. మరో వైపు సౌతాఫ్రికా 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ రెండు జట్లు 6 సార్లు తలపడ్డాయి. భారత్ 4 మ్యాచ్‌లలో గెలుపొందగా, సౌతాఫ్రికా 2 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది.