Trending Now

T20 World Cup 2024: 24న అమెరికాకు రోహిత్, హార్దిక్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పొట్టి ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా క్రికెటర్లు రెండు బ్యాచులుగా అమెరికా వెళ్లనున్నారు. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన టీమ్‌లలో ఉన్న క్రికెటర్లు తొలి విడతలో పయనం కానున్నారు. ఇప్పటికే ముంబై, పంజాబ్ జట్లు ఎలిమినేట్ కావడంతో రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రా, అర్షదీప్ ఈ నెల 24న అమెరికాకు పయనమవుతారని జైషా చెప్పారు. మిగిలిన ఆటగాళ్లు మే 27 లేదా 28న బయలుదేరే అవకాశముంది.

ఐపీఎల్‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌ ప్లేఆఫ్స్‌‌‌‌ చేరుకోకపోవడంతో ఆ టీమ్‌‌‌‌లో ఉన్న ఈ ముగ్గురూ అమెరికా వెళ్లి మెగా టోర్నీకి సన్నద్ధం కానున్నారు. ఐపీఎల్‌‌‌‌లో ప్లేఆఫ్స్‌‌‌‌ ఆడని జట్లలోని టీమిండియా ప్లేయర్లను.. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు ఎంపికైన వాళ్లు మొత్తం జట్టుతో కాకుండా ఈ నెల 24న తొలి విడతగా యూఎస్‌‌‌‌ఏకు పంపిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. వీరితో పాటు కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ వెళ్తారని చెప్పారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత మిగతా జట్టును పంపించేలా ప్లాన్‌‌‌‌ చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 2న టీ20 వరల్డ్ కప్ మొదలవుతుంది.

Spread the love

Related News

Latest News