Trending Now

న్యూజిలాండ్‌కు షాక్.. సూపర్-8కు చేరిన విండీస్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌పై వెస్టిండీస్ విజయం సాధించింది. ఆ జట్టు 13 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించింది. 150 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 136/9కే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ (40), అలెన్ (26) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4, మోతీ 3 వికెట్లతో చెలరేగారు. అంతకుముందు రూథర్‌ఫర్డ్ (68) వీరవిహారంతో విండీస్ 149/9 పరుగులు చేసింది. ఈ విజయంతో వెస్టిండీస్ సూపర్-8కి చేరగా, న్యూజిలాండ్‌కు బెర్త్ కష్టంగా మారింది.

Spread the love

Related News

Latest News