ICC Women’s T20WorldCup Team India schedule: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా టోర్నీ నిర్వహణ బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి తరలిన నేపథ్యంలో ఐసీసీ అప్డేట్ షెడ్యూల్ వెల్లడించింది. మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించగా..అక్టోబర్ 3 నుంచి 20 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు దుబాయ్, షార్జాలో నిర్వహించనున్నారు.
గ్రూప్ – ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలకం ఉండగా..గ్రూప్ – బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. భారత్.. అక్టోబర్ 4న న్యూజిలాండ్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. మొత్తం 23 మ్యాచ్‌లుండగా..ప్రతి జట్టు 4 గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఇప్పటివరకు ఆరుసార్లు ఆస్ట్రేలియా ఆరుసార్లు విజేతగా నిలిచింది.