ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, 24 : ఇంటర్ స్టేట్ ఫస్ట్‌గా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రథమ ర్యాంకర్ గా నిలిచింది. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఠాగూర్ వర్షిత ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకర్ గా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రథమ స్థాయి ప్రథమ ర్యాంకర్ గా నిలిచిన వర్షితను పలువురు అభినందించారు.