ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికలకు రెండు నెలల ముందు వివాదస్పద సీఏఏ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మార్చి 11వ తేదీ నుండి సీఏఏ అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొందరు సీఏఏకు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా సీఏఏ ఉందని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఏఏ అమలుపై తమిళ్ స్టార్ హీరో స్పందించారు. సీఏఏ చట్టాన్ని తమిళ వెట్రి కగజం పార్టీ పూర్తిగా వ్యరేకిస్తున్నట్లు ప్రకటించారు. విజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీఏఏ చట్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయరాదని అన్నారు. ఈ వివాదస్పద చట్టం అమలు కాకుండా స్టాలిన్ సర్కార్ చూడాలని విజయ్ కోరారు. కాగా, సౌత్‌లో స్టార్ హీరోగా రాణిస్తోన్న విజయ్ ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళ వెట్రి కగజం పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.