నిర్మల్ మండలంలోని తాంషా, తల్వేద అగ్ని ప్రమాదాలు..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 7 : నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు పడరాని పాట్లు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనికి తోడు తాజాగా నిర్మల్, సోన్ మండలాల లోని సాకెర, తల్వేద గ్రామాలలో ఒకేరోజు రెండు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం స్థానికంగా చర్చాంశానీయాంశంగా మారింది. సోన్ సాకెర గ్రామంలో మండుటెండలో లారీపై గోనె సంచులలో ఉన్న వరి ధాన్యాన్ని నింపుతుండగా ఒకేసారి మంటలు చిల్లరగాడంతో స్థానికంగా ఉన్న వారందరూ భయాందోళనలకు గురై పరుగులేడారు. లారీలో కాలిపోతున్న వరి ధాన్యం సంచులను తీసివేస్తూ పరిసరాలలో విసిరేస్తూ మరి కొందరు ఆ మంటలను ఆర్పేందుకు పరిసరాలలోన నీటి వసతితో ప్రయత్నాలు మొదలెట్టారు అప్పటికే సగానికి పైగా వరి ధాన్యము ఖాళీ బూడిదైంది. ప్రమాదం చోటుచేసుకుంది స్థానికంగా ఉన్న విద్యుత్ తీగలకు లారీలో నూనె సంచులలో అధికంగా అవడంతోనేనని అగ్నిమాపక శాఖ అధికారులు నిర్ధారించినప్పటికీ స్థానికులలో మాత్రం అనుమానాలు ఎండల కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని నాటుకున్నాయి.
దీనికి తోడు నిర్మల్ మండలంలోని తల్వేద గ్రామ సమీపంలో సోమవారం రాత్రి నిలిచి ఉన్న హార్వెస్టర్ల నుండి మంటలు చెలరేగి హార్వెస్టర్ మొత్తం కాలీ బూడిదైంది. సమాచారం అందుకొని అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పిఎఫ్ ప్రయత్నం చేయగా హార్వెస్టర్ అప్పటికే కాలిపోవుగా పరిసరాలలో ఉన్న వరి ధాన్యం సంచులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. హార్వెస్టర్ ఎండ వేడిమికి బ్యాటరీ లో నుంచి మంటలు రావడం జరిగిందని దీంతోనే ప్రమాదం చోటుచేసుకుందని అగ్నిమాపక శాఖ అధికారులు నిర్ధారించి తగిన విధంగా విచారణ జరిపి.. సుమారు 25 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. అటుతాంశలో ఇటు తల్వేద లో ఒకే రోజు రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో సూర్యప్రతాపమే దీనికి ప్రధాన కారణం అంటూ స్థానికులలో వేడిమి భయం మరింత నాటుకొని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.