ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో తొలి విజయం నమోదు అయింది. టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 50 వేల మెజార్టీతో విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ ఆయన రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు. దీంతో బుచ్చయ్య ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 22 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 126 చోట్ల, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 18 చోట్ల, బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 చోట్ల లీడింగులో ఉన్నాయి.