Trending Now

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్..

ప్రతిపక్షం, తెలంగాణ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వియషం తెలిసిందే. లాస్య నందిత మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘ఈ రోజు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తండ్రి సాయన్య చనిపోయిన ఏడాది లోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె విధి బలితీసుకుంది. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

TDP chief Chandrababu’s emotional tweet on the death of BRS MLA Lasya Nandita

Spread the love

Related News

Latest News