TDP leader Rajendra Prasad demanded to abolish the volunteer system: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? లేదా? అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేత, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని రద్దు చేయాలని, సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఇవ్వాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్పంచులతో చర్చించకుండా పంచాయతీ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. ఈ కారణంగానే అభివృద్ధి ఆగిందని.. అందుకే కృతనిశ్చయంతో పనిచేసి జగన్‌ను ఓడించామన్నారు. ఏ ప్రయోజనాల కోసమైతే జగన్‌ను ఓడించామో.. వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నట్లు చెప్పారు.