Trending Now

ఖమ్మం కార్పొరేషన్‌కు తేజల్ సర్వేక్షణ్ అవార్డు..

ప్రతిపక్షం, ఖమ్మం: ఖమ్మం నగర పాలక సంస్థకు తేజల్ సర్వేక్షణ్ జాతీయ స్థాయి పురస్కారం లభించింది. తాగునీరు, వ్యర్థజలాల పునర్వినియోగంపై నిర్వహించిన సర్వేలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఈ పురస్కారం లభించింది. రోజు విడిచి రోజు ఎలాంటి అంతరాయం లేకుండా పరిశుభ్రమైన నీటిని అందచేయడంతో పాటు.. నాణ్యత, సెప్టిక్ ట్యాంక్ శుభ్రత, మురుగునీటి శుద్ధి తదితర అంశాలకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ నెల 5వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాన్ని అందచేస్తారు.

Spread the love

Related News

Latest News