Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. దాదాపు నాలుగు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలను అప్పగిస్తూ తీర్మానం చేసింది. మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటి నాగోల్-ఎల్బీ నగర్-హయత్ నగర్, రెండోది ఎల్బీ నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటునకు ఆమోదం, ఉస్మానియా ఆస్పత్రి పున:నిర్మాణానికి గోషామహల్ గ్రౌండ్స్ భూమి బదలాయింపు, కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్, రేరాలో 54 పోస్టుల భర్తీకి నిర్ణయం, ఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు, టీచర్ పోస్టుల రేషనలైజేషన్‌కు సంబంధించిన వాటిపై నిర్ణయం తీసుకుంది.