ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగాల్సిన కేబినెట్ సమావేశం 2 గంటలకు వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ పథకానికి అవసరమైన నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణపై చర్చించి ఆమోదించనుంది. అలాగే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి సిఫార్సు చేసే అవకాశం ఉంది.