Trending Now

TG: రూ. 100 కోట్లు విరాళమిచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. దాదాపు 5 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. తమ ఒకరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వేతనాన్ని పొందే ప్రతి ఉద్యోగి కూడా తమ వంతు సహాయంగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నారు. దీని విలువ దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి. ల‌చ్చిరెడ్డి వెల్లడించారు. వరదల వల్ల అనేక జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితుల్లో త‌మవంతుగా ప్ర‌భుత్వానికి సహాయం చేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఉద్యోగుల త‌రఫున ఒకరోజు వేత‌నాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.

Spread the love

Related News