Mee Seva Telangana New Services: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీసేవలో మరో 9 రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు ఆ సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తహసీల్దార్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్రకటించింది.
ఈ మేరకు తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు ‘మీ సేవ ఆన్ బోర్డు’లో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
9 రకాల సేవలు ఇవే..
- స్టడీ గ్యాప్ సర్టిఫికెట్,
- పౌరుల పేరు మార్పిడి,
- మైనార్టీ సర్టిఫికెట్,
- క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్
- స్థానికత నిర్ధారణ,
- మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ,
- ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు
- ఆఱ్వోర్ 1బి సర్టిఫైడ్ కాపీలు
- ఆదాయం, కుల తదితర సర్టిఫికెట్ల జారీ