ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. మంగళగిరిలో చేనేత కార్మికుడు నేసిన శాలువాతో గవర్నర్ ను సత్కరించారు.
ఉండవల్లిలోని తమ నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ గారికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/jWJWYAwRC5
— Telugu Desam Party (@JaiTDP) June 28, 2024
సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ @CPRGuv గారికి ఉండవల్లి నివాసం వద్ద సాదర స్వాగతం పలికాను. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ గారిని సత్కరించాను. అనంతరం ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. pic.twitter.com/Hwh37sVtqo
— Lokesh Nara (@naralokesh) June 28, 2024