ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే పరీక్ష కేంద్రానికి ఒక్కనిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించడం లేదు. దీంతో విద్యార్థులు కాస్త ఆలస్యంగా వచ్చిన కేంద్రంలోకి అనుమతించడం లేదు అధికారులు. ఎంత ప్రాధేయపడ్డ కనికరం చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్ష హాజరు విషయంలో ప్రవేశపెట్టిన మినిట్ నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేక కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది.
పరీక్షకు అనుమతించకపోవడంతో మనస్తాపం చెందిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. దీంతో.. తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిలిస్తున్నారు. వీటన్నిటికి పరిజ్ఞానంలోకి తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం నిబంధనను సడలించింది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ని అనుమతించనుంది. ఫలితంగా ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఉంటుంది.