Telangana Panchayat Elections: సంక్రాంతిలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం మార్పు ఉండదని, నాలుగేళ్లు రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని చెప్పారు. రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, అప్పుడు సీఎంగా ఎవరు ఉండాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రతిపక్షాలు ఫేమస్ కావడానికి ఇష్టానుసారంగా మాట్లాడుతారని విమర్శలు చేశారు.



























