ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎస్‌అర్ నగర్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సీఈఓ వికాస్ రాజ్ ఇంటీ కి వెళ్లి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్, ప్రౌడ్ టు బి ఎ ఓటర్ సందేశంతో పాటు పోలింగ్ తేదీని సూచిస్తూ.. ఉన్న స్టిక్కర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్‌లో అన్ని రకాల వసతులు కల్పించినట్లు, మే13 వ తేదీన జరుగు పోలింగ్‌కు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఓటర్ స్లీప్, స్టిక్కర్స్ పంపిణీ వివరాలను వివరించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బి. హేమంత్, సహదేవ బేగంపేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.