Telangana Young India Schools inaugration: బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని, పదేళ్లలో ఆనాటి సీఎం కేసీఆర్ రూ.లక్షకోట్లు అప్పు చేశరని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొందుర్గులో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారన్నారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని. అందుకే విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని, వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖను ప్రక్షాళన చేస్తుందని, ఒక్కో స్కూల్ భవనాన్ని రూ.25 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు చెప్పారు.