Telegram app founder Pavel Durov arrested: టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. అజర్ బైజన్ నుంచి వెళ్తున్న ఆయనను ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని బోర్గెట్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, నేరాలను ప్రోత్సాహించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనపై గతంలోనే అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తాజాగా, అదుపులోకి తీసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.