Trending Now

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. పెరిగిన ఉష్ణోగ్రతలు

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలో ఎండలు మండిపోతున్నాయి. మే నెల చివరిదాకా ఎండలు ఎక్కువగా అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ మూడు నెలలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు కానున్నాయని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వేసవి తాపంపై హెచ్చరికలు జారీచేసింది. ఎల్‌నినో ప్రస్తుతం క్రమంగా వీక్ అయిపోతున్నా.. దాని ప్రభావం మాత్రం ఇంకో మూడు నెలలపాటు కొనసాగనుంది.

Spread the love

Related News

Latest News